Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీమిండియా విజయ లక్ష్యం 351

భారత్ తో జరుగుతున్న ఆరో వన్డేలో ఆస్ట్రేలియా ధాటిగా ఆడి భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆసీస్ 350 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్లు విఫలమైప్పటికీ టాపార్డర్ రాణించడంతో భారీ స్కోరు సాధించింది. బెయిలీ(156) కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించగా అతనికి వాట్సన్(102) చక్కని సహకారమందించాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు అమూల్యమైన 168 పరుగులు జోడించారు. ఇక ఐదో వికెట్ కి వోగ్స్ (44 నాటౌట్)తో కలిసి బెయిలీ 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా రెండేసి వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్, షమి చెరో వికెట్ తీసుకున్నారు.

More Telugu News